బురదలో కూరుకుపోయిన సూపర్ లగ్జరీ బస్సు (వీడియో)

8చూసినవారు
TG: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్ నల్లచెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్టీసీ బస్‌స్టాండ్‌ వర్షాలతో పూర్తిగా బురదమయంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. సోమవారం తొర్రూరు డిపోకు చెందిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు బురదలో కూరుకుపోయింది. డ్రైవర్ స్వయంగా పారతో మట్టిని తొలగించి బస్సును బయటకు తీశాడు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని బస్‌స్టాండ్‌లో పేరుకుపోయిన బురదను వెంటనే తొలగించి, కంకర లేదా పేవర్‌ బ్లాకులు వేసి పరిష్కారం చూపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్