ఆకాశంలో అధ్బుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ ఏడాది చివరి 'సూపర్ మూన్' ప్రపంచవ్యాప్తంగా కనువిందు చేసింది. భూమికి దగ్గరగా వచ్చి ప్రకాశవంతంగా దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నాసా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ఇండియా సహా పలు దేశాల ప్రజలు సూపర్ మూన్ ను తమ కెమెరాలలో బంధించి పోస్టులు చేస్తున్నారు. కాగా 2042 వరకు చంద్రుడు ఇంత దగ్గరగా కనిపించడని నిపుణులు చెబుతున్నారు.