రైతులకు సూపర్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయ్

34చూసినవారు
రైతులకు సూపర్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయ్
తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న విక్రయించిన రైతులకు నిధులు బదిలీ చేసింది. దీనికోసం రూ.1,173 కోట్లను జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 338 కేంద్రాల ద్వారా 2.41 లక్షల మంది రైతుల నుంచి 13.42 లక్షల టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశారు. క్వింటాకు రూ.2,400 మద్దతు ధర చెల్లిస్తున్నారు. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కూడా నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తున్నామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్