భార్యాభర్తలకు సూపర్ స్కీమ్.. కేవలం వడ్డీతోనే రూ.5 లక్షలు

38చూసినవారు
భార్యాభర్తలకు సూపర్ స్కీమ్.. కేవలం వడ్డీతోనే రూ.5 లక్షలు
ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన నెలవారీ ఆదాయం కోరుకునే వారికి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ప్రయోజనకరంగా ఉంటుంది. సింగిల్ అకౌంట్ అయితే ఒకే వ్యక్తి పేరు మీద గరిష్టంగా రూ.9 లక్షల వరకు, జాయింట్ అకౌంట్ అయితే భార్యాభర్తలు లేదా ఇద్దరు ముగ్గురు కలిసి గరిష్టంగా రూ.15 లక్షల వరకు జమ చేసుకోవచ్చు.జాయింట్ ఖాతాలో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. సంవత్సరానికి వచ్చే వడ్డీ రూ. 1,11,000, ప్రతి నెలా చేతికి వచ్చే ఆదాయం సుమారు రూ.9,250. ఐదు ఏళ్లలో వచ్చే మొత్తం వడ్డీ రూ. 5,55,000. ఇక మీరు పెట్టిన రూ.15 లక్షల అసలు మొత్తం ఐదేళ్ల తర్వాత తిరిగి వచ్చేస్తుంది.

సంబంధిత పోస్ట్