కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, స్థిరమైన, రిస్క్ లేని ఆదాయాన్ని కోరుకునే వారికి ఒక అద్భుతమైన పొదుపు పథకం. ఈ పథకంలో కనీసం రూ.1,000 తో ఖాతా తెరవవచ్చు. వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు, జాయింట్ ఖాతాలో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం 7.4% వార్షిక వడ్డీ రేటు లభిస్తోంది. జాయింట్ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తే నెలకు సుమారు రూ.9,250, వ్యక్తిగత ఖాతాలో రూ.9 లక్షలు జమ చేస్తే నెలకు సుమారు రూ.5,550 ఆదాయం పొందవచ్చు.