
వరల్డ్ బెస్ట్ చికెన్ జాబితా.. టాప్ 5లో బటర్ చికెన్
ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ తాజాగా ప్రపంచంలోనే అత్యుత్తమమైన చికెన్ వంటకాల జాబితాను ఆవిష్కరించింది. ఈ జాబితాలో టర్కియేకు చెందిన పిలిక్ టాప్కాపి మొదటి స్థానంలో నిలవగా, మొరాకోకు చెందిన రిఫిస్సా, కొరియన్ ఫ్రైడ్ చికెన్, పెరువియన్ రోస్ట్ చికెన్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ కు చెందిన బటర్ చికెన్ 5వ స్థానంలో చోటు దక్కించుకుంది. దీంతోపాటు తందూరీ చికెన్ (14), చికెన్ టిక్కా (35), చికెన్ 65 (38), చికెన్ రెజాలా (51), చికెన్ కాథి రోల్ (74) వంటి భారతీయ వంటకాలూ ఈ జాబితాలో చేరాయి.




