ఆంధ్రప్రదేశ్‌కు 18 నెలల్లో రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా, అవగాహన ఒప్పందాల (MOUల) తర్వాత నిర్ణీత సమయంలో పరిశ్రమలను స్థాపించే సంస్థలకు ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతా ద్వారా జమ చేయనున్నట్లు ఆయన చెప్పారు. అమరావతిలో త్వరలోనే క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కాబోతోందని, అమెరికా పెట్టుబడులకు సహకరించాలని శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డితో భేటీలో కోరారు.