భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీం ఆగ్రహం

27152చూసినవారు
భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు పిటిషన్‌పై సుప్రీం ఆగ్రహం
ఆసియా కప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యవసరంగా విచారించాలన్న పిటిషనర్ల అభ్యర్థనపై స్పందిస్తూ.. 'అంత అత్యవసరం ఏమిటి? అది కేవలం ఒక మ్యాచ్‌. అలా జరగనివ్వండి. మ్యాచ్‌ ఆదివారం ఉంది. ఏం చేయాలి?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ఆదివారం మ్యాచ్‌ ఉందని, శుక్రవారం జాబితాలో చేర్చకపోతే తన పిటిషన్‌ నిష్ఫలమవుతుందని పిటిషన్ న్యాయవాది కోర్టుకు తెలిపారు.

సంబంధిత పోస్ట్