పాస్‌పోర్ట్ లింగ గుర్తింపు.. ట్రంప్ నిర్ణయానికి సుప్రీంకోర్టు ఆమోదం

5చూసినవారు
పాస్‌పోర్ట్ లింగ గుర్తింపు.. ట్రంప్ నిర్ణయానికి సుప్రీంకోర్టు ఆమోదం
అమెరికాలో పాస్‌పోర్ట్‌లలో లింగ గుర్తింపు విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. గతంలో బైడెన్ పరిపాలన ప్రవేశపెట్టిన 'X' (లింగ నిర్ధారణ కాని) ఎంపికను ట్రంప్ రద్దు చేశారు. ఈ నిర్ణయం లింగమార్పిడి వ్యక్తుల హక్కులకు వ్యతిరేకమని, రాజ్యాంగ ఉల్లంఘన అని వాదించినప్పటికీ, సుప్రీంకోర్టు ట్రంప్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ట్రాన్స్‌జెండర్లు సైన్యంలో పనిచేయరాదనే ట్రంప్ ఉత్తర్వును కూడా సుప్రీం సమర్థించింది.

సంబంధిత పోస్ట్