గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ‘వంతారా’కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. వంతారా కార్యకలాపాలపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం, సంస్థ చేపడుతున్న జంతు సంరక్షణ చర్యలు చట్టబద్ధంగానే జరుగుతున్నాయని స్పష్టం చేసింది. విదేశాల నుంచి జంతువుల బదిలీలు అంతర్జాతీయ నిబంధనలు, అవసరమైన అనుమతులతోనే జరిగాయని పేర్కొంది. ప్రపంచ స్థాయి వన్యప్రాణుల పరిరక్షణ కార్యక్రమాలను కోర్టు అభినందించింది. వంతారా, దాని నిర్వహణ సంస్థలకు చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని గుర్తిస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.