ముస్లిం పురుషులు మూడుసార్లు తలాక్ చెబితే విడాకులు అయిపోయినట్టేనని, అయితే ఈ పద్ధతి రాజ్యాంగ విరుద్ధమని 2017లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కేంద్రం 2019లో చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, కొందరు తలాక్-ఎ-హసన్ పద్ధతిలో నెలకు ఒకసారి చొప్పున మూడు నెలలు తలాక్ చెప్పి విడాకులు ఇస్తున్నారు. తాజాగా, తలాక్-ఎ-హసన్ చట్టబద్ధతను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ ఆధునిక సమాజంలోనూ దీనిని ఎలా అనుమతిస్తున్నారని విస్మయం వ్యక్తం చేసింది. బుధవారం జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది.