
పురుగుల మందు తాగిన యువకుడు.. సోషల్ మీడియాలో వీడియో కలకలం
TG: పెద్దపల్లి మండలంలో ఓ యువకుడు మద్యం సేవిస్తూ పురుగుల మందు తాగుతున్నట్లు ఉన్న వీడియో ఇన్స్టాగ్రామ్లో వైరల్గా మారింది. వీడియోలో తాను చనిపోతున్నట్లు పేర్కొన్నట్లు సమాచారం. వీడియో వైరల్ కావడంతో పోలీసులు, గ్రామస్తులు యువకుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. దావన్నపల్లి-జగన్నాధపురం మధ్య పొలాల మార్గంలో యువకుడు వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. అతడు సిద్ధిపేటకు చెందిన వ్యక్తిగా గ్రామస్తులు చెబుతున్నారు.




