లవ్ మ్యారేజ్‌పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

7615చూసినవారు
లవ్ మ్యారేజ్‌పై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రేమ పెళ్లులు, పెద్దలు కుదిర్చిన పెళ్లులపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మ్యాట్రిమోనియల్‌ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ బీవీ నాగరత్న మాట్లాడుతూ, ప్రేమ పెళ్లిళ్లలో వివాహం తర్వాత ప్రేమ తగ్గిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. అదే సమయంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో దాంపత్య జీవనం కొనసాగేకొద్దీ పరస్పర అవగాహనతో ప్రేమ మరింత పెరుగుతోందని వ్యాఖ్యానించారు. వివాహ బంధంలో పరస్పర గౌరవం, సహనం, బాధ్యతలు కీలకమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్