విద్వేష ప్రసంగాలపై కొత్త చట్టాలు అవసరం లేదన్న సుప్రీం కోర్టు

7511చూసినవారు
విద్వేష ప్రసంగాలపై కొత్త చట్టాలు అవసరం లేదన్న సుప్రీం కోర్టు
దేశంలో విద్వేష, రెచ్చగొట్టే ప్రసంగాలను నియంత్రించడానికి కొత్త చట్టాలు అవసరం లేదని, ఇప్పటికే ఉన్న చట్టాలు సరిపోతాయని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ వ్యాఖ్యలు చేసింది. విద్వేష ప్రసంగాలపై చట్టబద్ధమైన శూన్యత లేదని, ప్రస్తుతం ఉన్న క్రిమినల్ చట్టాల్లో తగిన మార్గదర్శకాలు, శిక్షలు ఉన్నాయని కోర్టు తెలిపింది. చట్టాలు చేసే అధికారం న్యాయవ్యవస్థకు లేదని, ఈ విషయంలో నూతన మార్గదర్శకాలు విడుదల చేయలేమని ప్రకటించింది.

సంబంధిత పోస్ట్