అత్యవసర విచారణపై ‘సుప్రీం’ కీలక వ్యాఖ్యలు

92చూసినవారు
అత్యవసర విచారణపై ‘సుప్రీం’ కీలక వ్యాఖ్యలు
అత్యవసర విచారణలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. "ఎవరికైనా ఉరిశిక్ష అమలు చేయబోతున్నప్పుడు తప్పా మేము అదే రోజు అత్యవసరంగా ఏ కేసును విచారించం" అని జస్టిస్‌ సూర్యకాంత్ స్పష్టం చేశారు. న్యాయమూర్తులపై ఉన్న ఒత్తిడి, పని గంటలపై ఎవరైనా ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు. రాజస్థాన్‌లో ఇల్లు వేలం వేయడాన్ని నిలిపివేయాలని న్యాయవాది శోభా గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేయాలని కోరినప్పుడు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత పోస్ట్