మచిలీపట్నానికి చెందిన సింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో నిందితుడిని సుప్రీంకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 2014లో ఎస్తేర్ ను చంద్రభాను ముంబైలో హత్యాచారం చేసినట్టు నిర్ధారించిన ఉమెన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. 2018లో హైకోర్టు కూడా సమర్థించింది. నిందితుడు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా చంద్రభాను హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందంటూ అతడిని నిర్దోషిగా తెలుస్తూ తీర్పునిచ్చింది.