తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ మేరకు UPSC, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఇప్పటికే డీజీపీ నియామక ఉత్తర్వులను సస్పెండ్ చేయాలన్న పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.