దానం అనర్హతపై సుప్రీం తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు: హరీశ్ రావు

24చూసినవారు
దానం అనర్హతపై సుప్రీం తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు: హరీశ్ రావు
TG: దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ జారీ చేసిన తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. దీనిపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ‘దానం నాగేందర్ అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి చెంపపెట్టు. రాజ్యాంగంపై రాహుల్ గాంధీకి నిజమైన నిబద్ధత ఉంటే.. కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి, ప్రజల తీర్పు కోరాలి’ అని X వేదికగా డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్