TG: రాజ్యసభలో కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ ఎంపీ సురేశ్‌రెడ్డి, కిషన్‌రెడ్డి మధ్య వాగ్వాదం నెలకొంది. అమరావతికి చట్టబద్ధత బిల్లుపై చర్చ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై సురేశ్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఆర్‌పాటిల్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మేడిగడ్డ ప్రాజెక్టు పనికిరాకుండా పోయిందని నిపుణుల కమిటే చెప్పిందని సభలో ప్రకటించారు.