TG: అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ చేసి ఓ ప్రాణాన్ని నిలబెట్టారు. HYDలోని కార్వాన్ కుమ్మర్‌వాడి వద్ద మరమ్మతులు చేస్తున్న TGPDCL కాంట్రాక్ట్ కార్మికుడు విద్యుత్ షాక్‌తో కుప్పకూలిపోయాడు. గమనించిన కానిస్టేబుల్ సురేశ్ అతడికి వెంటనే CPR చేసి బతికించాడు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్‌ను సీపీ అభినందించారు.