
అండర్-19 వరల్డ్ కప్: న్యూజిలాండ్‌పై ఇండియా ఘన విజయం
బులవాయోలో శనివారం జరిగిన అండర్-19 వరల్డ్ కప్ గ్రూప్-బి ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి సూపర్-6కు దూసుకెళ్లింది. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో, ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 135 పరుగులకే ఆలౌటైంది. ఆయుష్ మాత్రే (53), వైభవ్ సూర్యవంశీ (40) రాణించడంతో పాటు, ఆర్ఎస్ అంబరీష్ (4/29), హెనిల్ పటేల్ (3/23) బౌలింగ్‌లో అదరగొట్టారు. లక్ష్య ఛేదనలో ఇండియా 13.3 ఓవర్లలోనే 130/3 స్కోరుతో విజయం సాధించింది. అంబరీష్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.




