సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌గా సూర్యకాంత్..!

124చూసినవారు
సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌గా సూర్యకాంత్..!
భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ నియామకం దాదాపు ఖరారైంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ బి.ఆర్‌. గవాయ్‌ తన వారసుడిగా జస్టిస్‌ సూర్యకాంత్‌ పేరును కేంద్ర న్యాయశాఖకు ప్రతిపాదించారు. సాంప్రదాయంగా పదవీ విరమణకు నెల రోజుల ముందే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. గవాయ్‌ పదవీకాలం నవంబర్‌ 23తో ముగియనుండగా, రాష్ట్రపతి ఆమోదం లభిస్తే సూర్యకాంత్‌ నవంబర్‌ 24న ప్రమాణం చేస్తారు.

సంబంధిత పోస్ట్