యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లెగూడెంలో ఒక తల్లి తన ఇద్దరు పిల్లలను చంపి, ఆపై తాను ఆత్మహత్య చేసుకున్న దారుణం చోటుచేసుకుంది. 10 నెలల శిశువు, రెండేళ్ల కుమారుడిని ఐశ్వర్య అనే తల్లి హత్య చేసి, అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.