యాదాద్రి భువనగిరి జిల్లాలో గరుడ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా రూ.9కే చీర ఆఫర్ ప్రకటించడంతో మహిళలు భారీగా తరలివచ్చారు. నిర్వాహకుల ఆఫర్‌తో ఒక్కసారిగా లోనికి ప్రవేశించేందుకు యత్నించిన మహిళల వల్ల తోపులాట చోటుచేసుకుంది. సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. ఈ ఘటనలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. అక్కడ వాతావరణం గందరగోళంగా మారింది.