యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముత్తిరెడ్డిగూడెం గ్రామ సమీపంలో రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ చీర కొంగు వెనుక చక్రంలో చిక్కుకోవడంతో కిందపడి తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలు వలిగొండ మండలం వెల్వర్తి గ్రామానికి చెందిన సుమారు 50 ఏళ్ల మహిళగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.