యాదాద్రి శ్రీవారికి సహస్రనామార్చన

276చూసినవారు
యాదాద్రి శ్రీవారికి సహస్రనామార్చన
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో బుధవారం ఉదయం సుప్రభాత సేవ, నిజాభిషేకం అనంతరం సహస్రనామార్చన శాస్త్రోక్తంగా జరిగింది. అర్చక బృందం, వేద పండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో, వివిధ రకాల పూలతో పూజలు నిర్వహించారు. పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం సుమారు గంట పాటు కొనసాగిన ఈ అర్చన పర్వాలలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్