
'కేంద్రం నుంచి రూ.13 లక్షల కోట్లు తెచ్చి ఏం చేశారో చెప్పాలి'
తెలంగాణ ప్రతిష్టను ప్రపంచానికి చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోందని, దేశ–విదేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ సమ్మిట్ ప్రారంభించారని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వ్యవస్థలు దెబ్బతిన్నాయని, కిషన్ రెడ్డి ప్రకటించిన రూ.13 లక్షల కోట్లు నిజమైతే రాష్ట్రం అప్పుల్లోకి ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. గత ప్రభుత్వ అప్పులను ప్రతినెల రూ.8 వేల కోట్ల చొప్పున చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.







































