అమెరికాలో గుండెపోటుతో చౌటుప్పల్ యువకుడు మృతి

1307చూసినవారు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కు చెందిన గోశిక యశ్వంత్ అమెరికాలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని నేడు స్వగ్రామానికి తీసుకువచ్చారు. నేడు అంత్యక్రియలు జరపనున్నారు. యశ్వంత్ తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరో నెలలో యశ్వంత్ వివాహం జరగాల్సి ఉండగా, ఈ విషాదం వారి కుటుంబాన్ని కుంగదీసింది.

సంబంధిత పోస్ట్