యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్ పేట గ్రామంలోని బీసీ వెల్ఫేర్ బాలికల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. ఐదవ తరగతి చదువుతున్న ఉరబాయి సంధ్య (10) హాస్టల్ లో ఉండటం ఇష్టం లేక సోమవారం తెల్లవారుజామున హాస్టల్ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. వారం రోజుల క్రితం హాస్టల్ లో అడ్మిట్ చేసిన తల్లిదండ్రులు, హాస్టల్లో ఉండడం ఇష్టం లేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలుపుతున్నారు.