యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కందిగడ్డ తండ గ్రామంలో శనివారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తేజావత్ హిమ్లా నాయక్ అనే రైతు తన వ్యవసాయ బావి వద్ద వరి పంట కోతకు రావడంతో హార్వెస్టర్ బండిని పిలిపించి, రెండు మడులు కోసేసరికి వడ్లు పోసుకోవడానికి ట్రాక్టర్ తీసుకొచ్చి హైడ్రాలిక్ లేపడంతో పైన ఉన్న 11 కెవి విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్ ఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.