యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని వంకమామిడి గ్రామంలో మంగళవారం హోలీ పండుగ సందర్భంగా ఓ హార్డ్వేర్ షాపులో అగ్నిప్రమాదం సంభవించింది. కటికరెడ్డి దామోదర్ రెడ్డికి చెందిన సుజాత హార్డ్వేర్ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో షాపులోని మెటీరియల్, సామాగ్రి, మోటార్, ఎలక్ట్రికల్, ఐరన్ వంటి వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు వ్యాపించి గ్యాస్ సిలిండర్ పేలడంతో గ్రామమంతా దట్టమైన పొగ కమ్మేసింది. గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే సుమారు రూ. 6 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.