రైలు కిందపడి యువతి ఆత్మహత

1చూసినవారు
రైలు కిందపడి యువతి ఆత్మహత
గొల్నెపల్లి గ్రామానికి చెందిన 20 ఏళ్ల గాదే ప్రవల్లిక, కుటుంబ కారణాలతో మనస్తాపానికి గురై గురువారం బీబీనగర్ మండలంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. నర్సింగ్ చదువుతున్న ప్రవల్లికను కుటుంబ సభ్యులు మందలించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం, మృతురాలి బంధువులు కుటుంబ కారణాలతో ప్రవల్లికను మందలించి, ఆమె మృతికి కారణమైన వ్యక్తి ఇంటి ముందు మృతదేహంతో నిరసన తెలిపారు. మృతురాలికి న్యాయం చేయాలని, కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎస్సై యుగంధర్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్