చందంపేట మండలంలోని పోలే నాయక్ తండాకు చెందిన రామావత్ బద్రియ (45) బుధవారం ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందారు. సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడానికి వెళ్తుండగా, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ట్రాక్టర్ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బద్రియ అక్కడికక్కడే మృతి చెందగా, మరికొంతమందికి గాయాలయ్యాయి. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.