గుర్రంపోడు మండలం పార్లపల్లి గ్రామంలో ఈదురు గాలులు, వర్షం కారణంగా గోడ కూలి పోతురాజు ప్రేమలత అనే మహిళ మృతి చెందింది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఈదురు గాలుల ప్రభావంతో సిమెంట్ ఇటుకలతో నిర్మించిన గోడ కూలి ప్రేమలతపై పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.