
కందిబండ సర్పంచ్ ఎన్నిక: గాయం త్రివేణి గోపి రెడ్డి నామినేషన్ దాఖలు
హుజూర్నగర్ నియోజకవర్గంలోని కందిబండ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గాయం త్రివేణి గోపి రెడ్డి గారు ఈ రోజు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాబోయే 17వ తేదీన జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో తనకు మద్దతుగా ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.








































