సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ నియోజకవర్గంలోని భీలియా నాఈయక్ తండ గ్రామానికి చెందిన భూక్య బాబు, కరుణల కుమారుడు గిరీష్ రాథోడ్, ఐఐటి మద్రాసులో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సాధించినందుకు ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యూత్ ప్రెసిడెంట్ భూక్య చంటి నాయక్, గిరీష్ ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత విద్యనభ్యసించి, సమాజ సేవ చేయాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్ భూక్య నాగు నాయక్, పశువైద్యాధికారి భూక్య రమేష్ తదితరులు పాల్గొన్నారు.