చింతలపాలెం మండలంలోని కిష్టాపురం గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంఘటనలో ఒక ఇంటిని ధ్వంసం చేసినట్లు సమాచారం. పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో శాంతిభద్రతలను కాపాడేందుకు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.