
ఈ నెల 19 వరకు శాంతి రిమాండ్ పొడిగింపు
ఏపీ దేవాదాయ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 19 వరకు పొడిగించింది. నేటితో ఆమె రిమాండ్ ముగియడంతో అధికారులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు శాంతిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.




