
బిహార్ ఎన్నికలు.. మధ్యాహ్నం 3 గంటల వరకూ రికార్డు స్థాయిలో ఓటింగ్
బిహార్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మంగళవారం జరుగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయానికి 60.04 శాతం ఓట్లు నమోదయ్యాయి. జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్, పుర్ణియా స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్, మాజీ సీఎం జితన్ రాం మాంఝీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 20 జిల్లాల్లోని 122 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. బిహార్ సరిహద్దులను 72 గంటల పాటు మూసివేశారు.




