
ఏపీలో మే 25 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్ 4 వరకు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ ప్రకటించింది. పరీక్ష ఫీజును మే 1 నుంచి 9 వరకు చెల్లించవచ్చు. రూ.50 ఆలస్య రుసుముతో మే 25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రీకౌంటింగ్ (ఒక్కో సబ్జెక్టుకు రూ.500), రీ వెరిఫికేషన్ (ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000) కోసం మే 1 నుంచి 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.




