హుజూర్నగర్ మున్సిపల్ పరిధిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ కృషి చేస్తుందని ఏఈ రాంప్రసాద్ తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన విద్యుత్ సమస్యల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వార్డుల్లో విరిగిన పోల్స్ స్థానంలో కొత్త పోల్స్ ఏర్పాటు, తీగల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.