సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు కిలోన్నర గంజాయి, ఒక బైక్, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను రిమాండ్‌కు తరలించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల సహకారం అవసరమని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.