హుజూర్ నగర్ పట్టణంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు కిలోన్నర గంజాయితో పాటు ఒక బైక్, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి, అనంతరం రిమాండ్‌కు తరలించారు. పట్టణంలో మాదకద్రవ్యాలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.