గరిడేపల్లి మండలం సర్వారం సహకార బ్యాంకు చైర్మన్ గా పెండెం ముత్యాలు గౌడ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ముత్యాల గౌడ్ మాట్లాడుతూ అందరి సహకారంతో సర్వారం సహకార బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మండల పార్టీ అధ్యక్షులు అంజన్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా ముత్యాలు గౌడ్ ఎన్నిక పట్ల పలువురు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.