హుజూర్ నగర్: రక్తదానం పై అవగాహన పెంచు కోవాలి

3చూసినవారు
హుజూర్ నగర్: రక్తదానం పై అవగాహన పెంచు కోవాలి
హుజుర్నగర్ లోని సింధు హాస్పిటల్ లో మోకాలి సర్జరీ చేయించుకుంటున్న లక్ష్మి అనే మహిళకు ఓ పాజిటివ్ రక్తం అవసరం కాగా, లంక కిరణ్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తాన్ని దానం చేశారు. ఈ సందర్భంగా జనచైతన్య ట్రస్ట్ ఉపాధ్యక్షులు పిల్లి శివశంకర్ మాట్లాడుతూ రక్తదానం పట్ల అవగాహన పెంచుకోవాలని, రక్తదానం చేసేవారికి గుండె జబ్బులు, క్యాన్సర్, కొలెస్ట్రాల్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలను ఉటంకిస్తూ తెలిపారు.

ట్యాగ్స్ :