ప్రభుత్వ విద్యా రంగ అభివృద్ధికి ఉపాధ్యాయుడు మాతంగి ప్రభాకర్ చేసిన కృషి అభినందనీయమని పి ఆర్ టి యు సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జితేందర్ రెడ్డి, తీగల నరేష్ లు అన్నారు. మంగళవారం హుజూర్నగర్ ప్రభుత్వ పాఠశాల లో జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందనున్న మాతంగి ప్రభాకర్ ను అభినందించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ భాద్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, బంధువులు, మిత్రులు ఉన్నారు.