హుజూర్ నగర్: ఘనంగా మట్టల పండుగ

79చూసినవారు
హుజూర్ నగర్: ఘనంగా మట్టల పండుగ
హుజూర్ నగర్‌లో శ్రీనగర్ కాలనీలోని గుడ్ న్యూస్ ప్రార్థన మందిరంలో పాస్టర్ ఊటుకూరి రాజు ఆధ్వర్యంలో మట్టల పండుగ నిర్వహించారు. క్రైస్తవ భక్తులు ఈత మట్టల పట్టుకొని పట్టణ వీధుల్లో ఊరేగింపులు నిర్వహించారు. హోసన్నా జేమే దావీదు కుమారునికి జైమే అంటూ గీతాలు ఆలపించారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏడాది ఈ రోజున మట్టల ఆదివారం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంఘ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్