హుజూర్‌నగర్ నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు

0చూసినవారు
హుజూర్‌నగర్ నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు
హుజూర్‌నగర్ పోలీసులు బుధవారం నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సహాయంతో పట్టణంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు హోటళ్లు, టీ స్టాళ్లు, మెడికల్ షాపులు, కూరగాయల దుకాణాలు, బహిరంగ ప్రదేశాలు, వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించాయి. నార్కోటిక్ డాగ్ ‘రోలెక్స్’ సహాయంతో అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా సమాజం సహకరించాలని, గంజాయి వినియోగం, రవాణా లేదా సరఫరాపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. డ్రగ్స్ వ్యవహారాల్లో ఎలాంటి ఉపేక్ష ఉండదని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :