హుజూర్ నగర్ మండలంలోని బూరుగడ్డ గ్రామానికి చెందిన ఈడుపుగంటి సుబ్బారావు ను టిపీసీసీ జనరల్ సెక్రెటరీగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంగళ వారం ప్రకటించింది. ఈ మేరకుపార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేసారు. ఈ సంధర్భంగా సుబ్బారావును పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందించారు.