హుజూర్నగర్: తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం

72చూసినవారు
హుజూర్నగర్: తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పునర్ వైభవం వస్తుందని ఆ పార్టీ హుజూర్నగర్ సంస్థ గత ఎన్నికల పరిశీలకుడు అమరవరపు శ్రీమన్నారాయణ అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం నియోజకవర్గంలోని ఐదు మండలాల అధ్యక్ష, కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి మండల వెంకటేశ్వర్లు గౌడ్, రామ జోగి, రోశపతి ఉన్నారు.

సంబంధిత పోస్ట్